మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

1 గంట క్రితం

Five members of the same family commit suicide
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 11:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీశైలం : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీశైలంలో జరిగింది. ఈ నెల 20 న సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం.. ఆటోలో వచ్చి శ్రీశైలం వడ్డెర అన్నదాన సత్రంలో రూమ్ నంబర్ 11 ను తీసుకున్నారు. గత 3 రోజులుగా బయటకు రాకపోవడంతో పాటు దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన సత్రం నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు తెరచి చూడగా బాత్రూమ్‌లో ముగ్గురు మహిళలు, ఫ్యాన్‌కు ఇద్దరు పురుషులు ఉరివేసుకొని కనిపించారు. మృతులు సుధాకర్ (36), గోగుల ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), మణికంఠ (15)గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్