శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భోగాపురంలో ల్యాండింగ్‌కు ఆటంకం..నాగపూర్‌కు ఎయిర్‌ ఇండియా మళ్లింపు

24 సెప్టెంబర్, 2026

res
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 07:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఉండటంతో రెండు గంటల ఉత్కంఠ

  • భారీ వర్షాలతో సిగ్నల్ వ్యవస్థలో అంతరాయం

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి: భారీ వర్షాల కారణంగా భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్‌ కావాల్సిన ఎయిర్‌ ఇండియా IX 1373 విమానం దారి మళ్లింది. బుధవారం రాత్రి 8.35 గంటలకు విజయవాడ నుంచి భోగాపురానికి బయలుదేరిన ఈ విమానం రాత్రి 9.40 గంటలకు భోగాపురంలో ల్యాండ్‌ కావాల్సి ఉంది. అయితే ఆ సమయంలో భోగాపురం పరిసరాల్లో భారీ వర్షం కురవడంతో సిగ్నల్‌ వ్యవస్థలో అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. దీంతో విమానాన్ని భోగాపురంలో ల్యాండ్‌ చేయకుండా నాగపూర్‌కు దారి మళ్లించారు. ఈ విమానంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్‌ ఉన్నారు. విమానం భోగాపురంలో దిగకపోవడంతో ప్రయాణికుల్లో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. సుమారు రెండు గంటల అనంతరం విమానం నాగపూర్‌ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో అధికారులు, ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఆందోళన నుంచి బయటపడ్డారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్