ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : స్థానిక పలకలూరు రోడ్డులో నివాసం ఉంటున్న దొడ్డ నాగరాజు హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. గత నెల 20న నాగరాజు అదృశ్యమైనట్లు అతని తండ్రి దొడ్డ నతానియేల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా హత్య చేసినట్టు వెల్లడయింది. ఇందుకు సంబంధించిన వివరాలను డిఎస్పి బెల్లం శ్రీనివాసరావు శనివారం మీడియాకు తెలిపారు. సిఐ గంగా వెంకటేశ్వర్లు తన సిబ్బంది సహకారంతో సాంకేతిక పరిజ్ఞానం సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా లోతుగా దర్యాప్తు చేపట్టారు. వెంగళాయపాలెంకు చెందిన నడ్డి దుర్గా యశ్వంత్, స్తంభాలగరువుకు చెందిన నడ్డి మల్లు, అడవితక్కెళ్లపాడు నివాసి నంబూరు అశోక్, బొంగరాలబీడుకు చెందిన దాసరి సుభాష్ అనే నలుగురిని అరెస్టు చేశారు. నిందితులను విచారించగా, మృతుడు దొడ్డ నాగరాజుకు నడ్డి దుర్గా యశ్వంత్ గతంలో రూ.10వేలు ఇవ్వవలసి ఉన్నట్లు, ఆ డబ్బుల విషయమై వారిద్దరి మధ్య వివాదం ఉన్నట్లు వెల్లడైంది. మద్యం సేవించడానికి నడ్డి మల్లు, నంబూరు అశోక్, దాసరి సుభాష్, దొడ్డ నాగరాజు అడవితక్కెళ్లపాడులోని టిడ్కో ఇళ్ల వద్ద కలుసుకున్నారు. అనంతరం వారు స్వర్ణభారతి నగర్‌కు వెళ్లగా, అక్కడ నాగరాజు తనకు రావలసిన డబ్బుల గురించి యశ్వంత్‌ను ప్రశ్నించడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో యశ్వంత్ సూచన మేరకు మిగిలిన ముగ్గురు నిందితులు నాగరాజును ఇన్నర్ రింగ్ రోడ్, ఫేజ్-3 ప్రాంతానికి తీసుకువెళ్లి బీరు బాటిళ్లతో దాడి చేసి గాయపరిచగా నాగరాజ చనిపోయినాడని నిందితుల వాంగ్మూలాల ద్వారా వెల్లడైంది. నిందితులను కోర్టులో హజరు పర్చగా రిమాండ్ విధించారని డిఎస్పి తెలిపారు.
హత్య కేసులో నలుగురు అరెస్టు
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026, 10:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)