- మరొకరి పరిస్థితి విషమం
ఎన్టీఆర్ : విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ) క్షణాల్లో మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. కారులోనే నలుగురు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను నున్నకు చెందిన కొమ్మారెడ్డి రాందేవ్ (39), ఆయన తల్లి అరుణ, ఒక చిన్నారి, నంబూరుకు చెందిన తిగురు విజయగా గుర్తించారు. నంబూరులో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు మంటల్లో చిక్కుకోవడంతో ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







కామెంట్‌లు (0)