బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి

1 గంట క్రితం

Four students killed after being hit by a train.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 03:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీకాకుళం : ఎపి లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం శ్రీకాకుళం టెక్కలి బర్మా కాలనీ సమీపంలో రైల్వేట్రాక్‌ పై నడుచుకుంటూ వెళుతున్న విద్యార్థులను రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్టల్ విద్యార్థులు నౌపడ నుంచి బయలుదేరి టెక్కలి వైపు రైల్వేట్రాక్‌ పక్కన చేపలు పట్టేందుకు రైల్వే ట్రాక్‌పై నడిచి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులంతా ఒడిశా కు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. గాయపడిన విద్యార్థిని టెక్కలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్