బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటర్ల 'ప్రత్యేక సమగ్ర తొలగింపు’ ప్రక్రియగా మారిన ఎస్‌ఐఆర్‌ : ఎంఎ.బేబి

1 గంట క్రితం

MA Baby
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 03:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ప్రస్తుతం కొనసాగుతున్న 'ప్రత్యేక సమగ్ర సవరణ' (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ, ఓటర్ల జాబితా నుండి ఓటర్ల 'ప్రత్యేక సమగ్ర తొలగింపు’ ప్రక్రియగా మారిందని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ.బేబి బుధవారం వ్యాఖ్యానించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) జ్ఞానేష్‌ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం తక్ష‍ణమే తొలగించాలని లేదా ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ.బేబి బుధశారం డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం చేపడుతోంది ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కాదని, ఓటర్ల జాబితా నుండి ‘ప్రత్యేకంగా తీవ్రస్థాయిలో ఓటర్లను తొలగింపును సమర్థవంతంగా చేపడుతోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి పది నెలల వ్యవధిలో కనీసం 14 సార్లు కీలక నిర్ణయాలపై అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ జాతీయ మీడియాలో వెలువడిన కథనంపై ఆయన స్పందించారు. ఎన్నికల సంఘం నియంతృత్వంగా, అప్రజాస్వామిక పద్థతిలో పనిచేస్తోందని విమర్శించారు. ఎన్నికల సంఘంలో ముగ్గురు సభ్యులు ఉన్నారని, ప్రతి నిర్ణయం కూడా ఏకగ్రీవంగా లేదా మెజారిటీ అభిప్రాయం ఆధారంగా తీసుకోవాల్సి వుందని అన్నారు. కానీ ప్రస్తుతం సిఇసి మెజారిటీ అభిప్రాయాన్ని అంటే తన సహచరులైన ఇద్దరు సభ్యుల అభిప్రాయాలను పట్టించుకోకుండా, సొంత అభిప్రాయాన్ని ప్రజలపై రుద్దుతున్నారని అన్నారు. ఇది చట్టవిరుద్ధమని, అప్రజాస్వామికమని, ఇది నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారు. దీంతో ఆయనకు సిఇసిగా కొనసాగే హక్కు లేదని, ఆయన తక్ష‍ణమే రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. లేదా కేంద్ర ప్రభుత్వం ఆయనను ఆ పదవి నుండి తొలగించాలని అన్నారు. ఇది సిపిఐ (ఎం) ప్రధాన డిమాండ్‌ అని అన్నారు. పలు రాష్ట్రాల్లో చేపడుతున్న ఎస్‌ఐఆర్‌పై స్పందిస్తూ.. రాజకీయ భాగస్వాములందరి విశ్వాసాలను పరిగణనలోకి తీసుకునే వరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తిగా లోపభూయిష్టమని స్ఫష్టమైందని అన్నారు. ఎస్‌ఐఆర్‌ పూర్తి అర్థం ప్రత్యేక సమగ్ర సవరణ అని, కానీ ఎస్‌ఐఆర్‌ అంటే ‘ ప్రత్యేకమైన ముమ్మర తొలగింపులు’ అని చెబుతానని అన్నారు. లోపభూయిష్టమైన ఈ ప్రక్రియను అడ్డుకోవాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌ను పున:పరిశీలన చేయాలని, దేశవ్యాప్తంగా రాజకీయ నేతలతో చర్చించిన అనంతరం ఈ అంశంపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్