బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిప్యూటీ తాసిల్దార్ ఇబ్రహీం పై చర్యలు తీసుకోవాలి : వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

1 గంట క్రితం

manyam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 03:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : మండలంలోని డిప్యూటీ తాసిల్దార్ షేక్ ఇబ్రహీం పై చర్యలు తీసుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొల్లి గంగు నాయుడు డిమాండ్ చేశారు బుధవారం మక్కువ మండల తాసిల్దార్ భాను ప్రసాద్ కి పాపయ్య వలస దళితులతో కలిసి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములక్కాయ వలస రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 17లో 23 ఎకరాల 68 సెంట్లు భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తించి పాపయ్య వలస దళితులకు డి పట్టాలు మంజూరు చేస్తే, ఆ భూమిని కొంత మంది పెత్తందారులు జిరాయితీ భూమిగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే పెత్తందారులకు పూర్తిస్థాయిలో డిప్యూటీ తాసిల్దార్ షేక్ ఇబ్రహీం సహకరిస్తున్నారని ఆరోపించారు. అలాగే దళితులకు వ్యతిరేకంగా జిల్లా రెవిన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు ఇబ్రహీం తప్పుడు రిపోర్టులు పంపిస్తున్నారని అన్నారు డిప్యూటీ తాసిల్దారు ఇబ్రహీంపై గతంలో అనేక ఫిర్యాదులు ఉన్నాయని ఫిర్యాదుల కారణంగానే మక్కువ మండలం నుండి బదిలీ చేస్తే మళ్లీ కావాలని మండలానికి బదిలీ చేయించుకున్నారని అన్నారు.మండలంలో ఈయన వలన రెవెన్యూ సమస్యలు అధికంగా గిరిజనులు , దళితులు, పేదలు కు అన్యాయం చేస్తూ, అదికార పార్టీ నాయకులు కు సహకరిస్తున్నారని అన్నారు ఫిర్యాదులున్న డిప్యూటీ తాసిల్దార్ షేక్ ఇబ్రహీం ని వెంటనే మండలం నుండి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పాపయ్య వలస దళితులకు ఇచ్చిన డి పట్టా భూములకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించి వారికి హక్కులు కల్పించాలని కోరారు లేకపోతే భవిష్యత్తులో మండలం లో ఉన్న రెవిన్యూ సమస్యలన్నిటిపై పెద్ద ఎత్తున ప్రజలను కదిలించి మండల కార్యాలయం వద్ద ఆందోళన చేయాల్సిన పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పాపయ్య వలస దళితులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్