గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన జి.కావ్యశ్రీ

57 నిమిషాల క్రితం

vzm-2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 04:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - వేపాడ: వేపాడ మండలం బక్కునాయుడుపేట ఏపీ ఆదర్శ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వికసిత్‌ భారత్‌లో భాగంగా నిర్వహించిన సేవా సంకల్ప్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్‌ 28న మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎలక్యూషన్‌, డ్రాయింగ్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఆదర్శ పాఠశాలకు చెందిన డి.సిరి, వర్షిత, జి.కావ్యశ్రీ, ఎన్‌.మోక్షజ్ఞ, ఎస్‌.హర్షిత పాల్గొని జిల్లా స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ రావాడ ఈశ్వరరావు తెలిపారు.

జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఎలక్యూషన్‌లో జి.కావ్యశ్రీ ప్రథమ స్థానం, డ్రాయింగ్‌లో ఎస్‌.హర్షిత తృతీయ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. విద్యార్థులను ప్రోత్సహించి విజయానికి కృషి చేసిన పీజీటీ ఇంగ్లీష్‌ ఉపాధ్యాయురాలు జి.నాని రమణతో పాటు విజేతలను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్