గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు తొండవాడ విద్యార్థి రిషి

1 గంట క్రితం

tirupati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 05:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - చంద్రగిరి : బీఎన్‌ఆర్‌ జెడ్పీ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న వి. రిషి బాక్సింగ్‌లో సత్తా చాటుతున్నాడు. పాఠశాల పీఈటీ శ్రీమన్ నారాయణరెడ్డి గారి మార్గదర్శకత్వంలో అండర్‌–17 విభాగంలో 80 కిలోలకు పైబడిన బరువు కేటగిరీలో జిల్లా స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో రిషి బంగారు పతకం సాధించాడు. ఈ ప్రతిభతో ప్రస్తుతం రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యాడు. తొండవాడలోని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన రిషి జిల్లా స్థాయిలో స్వర్ణ పతకం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. రిషి విజయాన్ని పురస్కరించుకుని నందకుమార్‌, ఆయన సతీమణి సాయి చందన రిషిని అభినందించి, ప్రోత్సాహకంగా బాక్సింగ్‌ గ్లౌవ్స్‌ను అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. రిషిని బాక్సింగ్‌లో ప్రోత్సహిస్తూ, అతని విజయానికి సహకరిస్తున్న తల్లిదండ్రులు అనంత కుమార్‌, శ్యామల దంపతులను కూడా నందకుమార్‌, సాయి చందన అభినందించారు. రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్‌లో రిషి ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, తొండవాడ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్