గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రక్తదానం చేసి మానవతా విలువలు చాటిన విద్యార్థులు

55 నిమిషాల క్రితం

annamayya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 05:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - పీలేరు : రక్తదానం చేసి విద్యార్థులు తమ మానవతా విలువలను చాటారని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సి. విజయ్ భాస్కర్ రెడ్డి తెలిపారు. గురువారం పీలేరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి సీఎన్ఆర్ డిగ్రీ కళాశాల, సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మార్గదర్శి డిగ్రీ కళాశాల, ఎంజేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి అండగా నిలవడంతో పాటు, యువతలో రక్తదానంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, ఒక వ్యక్తి చేసే రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. యువతలో సేవాభావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, సేవా కార్యక్రమాల అధ్యక్షుడు మహేష్ గుప్తా, సత్యం రెడ్డి, శశిధర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, మహేష్ పవన్, పూర్వ జిల్లా గవర్నర్ టీవీఎస్‌ఆర్‌కేవీ ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే భారత వైద్య సంఘం పీలేరు అధ్యక్షుడు డాక్టర్ గుర్రప్ప, కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ నాయక్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. చంద్రశేఖర్, డాక్టర్ నాగవేణి, చిత్తూరు రక్తనిధి కేంద్రానికి చెందిన వైద్యులు, సాంకేతిక సిబ్బంది పాల్గొని శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. రక్తదానం చేసిన విద్యార్థులను లయన్స్ క్లబ్ సభ్యులు, వైద్యులు అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్