గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

4న సిఎం చంద్రబాబు పర్యటన .. ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పి

1 గంట క్రితం

cm visit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 04:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

-బుర్రిపాలెంలో సభా వేదిక, హెలిప్యాడ్‌ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పి వకుల్‌ జిందాల్‌

-800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు

ప్రజాశక్తి–తెనాలిరూరల్ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్టోబర్‌4న తెనాలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ (పిఎంఎవైజి) కింద మంజూరైన గృహ నిర్మాణ పనులకు సిఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా తక్కువ వ్యయంతో, వేగంగా ఇళ్ల నిర్మాణానికి ఉద్దేశించిన 3డి ప్రింటెడ్‌ హౌసింగ్‌ టెక్నాలజీ పైలట్‌ ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నట్లు సమాచారం.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బుర్రిపాలెంలో జరుగుతున్న ఏర్పాట్లను గుంటూరు జిల్లా ఎస్పి వకుల్‌ జిందాల్‌ గురువారం పరిశీలించారు. బహిరంగ సభా వేదిక, హెలిప్యాడ్‌, రహదారుల మరమ్మతు పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సిఎం పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనకు సుమారు 800 మంది పోలీస్‌ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బుర్రిపాలెం చేరుకునేందుకు ప్రధాన రహదారి ఒక్కటే ఉన్నందున ట్రాఫిక్‌ మళ్లింపునకు ప్రత్యామ్నాయ మార్గాలు పరిమితంగా ఉన్నాయని పేర్కొన్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎస్పి వెంట తెనాలి డిఎస్పి బి జనార్ధనరావు, ఎసిబి డిఎస్పి అలహరి శ్రీనివాస్, రూరల్ సిఐ నాయబ్ రసూల్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొని సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.



cm visit -1

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్