ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల నూతన ఆవిష్కరణలు, వ్యాపార అభివృద్ధి కేంద్రం, సంస్థాగత ఆవిష్కరణ మండలి ఆధ్వర్యంలో 30 రోజుల సెరామిక్స్, టెర్రకోట బొమ్మల తయారీ శిక్షణ గురువారంతో ముగిసింది. క్రాఫ్ట్‌శాలా, రెజొనెన్స్ ఇంటర్నేషనల్ సహకారంతో జూలై 16 నుంచి ఆగస్టు 20 వరకు ఈ శిక్షణ నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామచంద్ర ఆర్.కె., సమన్వయకర్తలు ఎన్. బేబీ నిర్మల, బి. దుర్గాలక్ష్మి, ఎ. రాజేశ్వరి, నూజిల్ల శ్రీనివాస్, క్రాఫ్ట్‌శాలా ప్రతినిధి రుద్రపాటి రాజు, శిక్షకురాలు హర్షిత పాల్గొని అర్హత సాధించిన విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. విద్యార్థులను ఉద్యోగార్థులుగా కాకుండా వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, సృజనాత్మకతను చిన్న తరహా వ్యాపారాలుగా మార్చుకునేందుకు ప్రోత్సాహం, మార్గదర్శకత్వం అందిస్తున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు. పలువురు విద్యార్థులు ఇప్పటికే సొంత ఉత్పత్తుల విక్రయాలు ప్రారంభించడం అభినందనీయమన్నారు.
సెరామిక్స్, టెర్రకోట శిక్షణతో విద్యార్థులకు స్వయం ఉపాధి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 01, 2026, 05:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)