ప్రజాశక్తి -గండేపల్లి
సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ ఫార్మసీ విభాగం ఆధ్వర్యంలో ఆరోగ్య రంగంలో గురువారం కృత్రిమ మేధస్సు వినియోగంపై ఎఐ స్పైర్ 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో ఎఐపై అవగాహన, సృజనాత్మకత, ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఎఐ పోస్టర్ ప్రెజెంటేషన్, ఎఐ స్లయిడ్ క్రాఫ్ట్, ఎఐ వీడియో విజన్, ఎఐ ప్రొఫైల్ క్రాఫ్ట్ అనే నాలుగు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ అవగాహనా సదస్సు ప్రారంభిస్తూ ఆదిత్య యూనివర్సిటీ డిప్యూటీ ప్రో-ఛాన్సలర్ డాక్టర్ ఎం.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో విద్యార్థులు ఎఐ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మాగంటి వెంకటేష్ మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో ఎఐ టెక్నాలజీ గురించి, మరియు వివిధ ఎఐ సాధనాల వినియోగంపై ప్రాక్టికల్ శిక్షణ అందించారు. స్కూల్ ఆఫ్ ఫార్మసీ, డీన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దేశంలో 16 విశ్వవిద్యాలయాలు 20 అనుబంధ కళాశాలలకు చెందిన సుమారు 450 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థుల్లో ఎఐ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎఐ స్పైర్ - 2026’ ఒక మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాకట్ర్ జి.సురేష్, ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ రమేష్, డాక్టర్ టి.రవి తంగజం, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ కె.రవిశంకర్, అధ్యాపకులు, మరియు విద్యార్థులు హాజరయ్యారు. ఈ అవగాహనా సదస్సులో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలకు నగదు ప్రోత్సాహకాలు ప్రశంసాపత్రం అందజేశారు.








కామెంట్‌లు (0)