ప్రజాశక్తి- వేపాడ : మండలంలోని బక్కు నాయుడుపేట వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతిగృహంలో పదో తరగతి చదువుతున్న జి.గౌరీ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైంది. ఈ నెల 20న విజయనగరం జిల్లా కేంద్రంలోని విజ్జి స్టేడియంలో నిర్వహించిన అండర్-16 క్రీడా పోటీల్లో షాట్‌పుట్‌లో ప్రథమ స్థానం, జావెలిన్ త్రోలో ద్వితీయ స్థానం సాధించింది. ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన గౌరీని వసతిగృహ ప్రిన్సిపల్ టి. జయశ్రీ, పీడీ పి. అరుణ, పీఈటీ జి. సంతోష్‌కుమార్‌తోపాటు ఉపాధ్యాయులు అభినందించారు. వసతిగృహానికి మంచి పేరు తీసుకువచ్చిన గౌరీ రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ కనబరచాలని వారు ఆకాంక్షించారు.
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన జి.గౌరీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 04:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)