అమరావతి : రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనిసవాసరావు గురువారం డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిలా టెక్కలి మండలం డమర గ్రామానికి చెందిన నలుగురు గిరిజన విద్యార్థులు రైలు ప్రమాదంలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలు నిరుపేదలని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. తల్లిదండ్రులు పేదవారైనా పిల్లలను చదివించి ప్రయోజకులను చేయాలనే ఎంతో ఆశపడ్డారని, కానీ చిన్న వయస్సులోనే ఆ విద్యార్థులు ప్రమాదానికి గురై మరణించడం విచారకరమని అన్నారు. ఈ ప్రమాదంలో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థికి మెరుగైన వైద్యం అందించి, చికిత్సకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.
రైలు ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలి : వి.శ్రీనివాసరావు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 04:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)