బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపొగాకు రైతులను ప్రభుత్వం వీధిన పడేసింది

2 గంటల క్రితం

JAGAN
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 12:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • దేవరపల్లి పొగాకు కేంద్రం సందర్శనలో జగన్

ప్రజాశక్తి- దేవరపల్లి (తూర్పుగోదావరి) : చంద్రబాబు రెండేళ్ల పాలనలో రైతన్నలను ముఖ్యంగా పొగాకు రైతులను వీధినపడేసిందని వైసిపి అధినేత, మాజీ సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో దేవరపల్లికి జగన్ వచ్చారు. అక్కడ నుంచి ర్యాలీగా పొగాకు కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు. పొగాకు కొనుగోళ్ల తీరును పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు ధర రావడం లేదని పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కిలో పొగాకుకు గతంలో రూ.365 వరకు ధర పలికిందని, ప్రసుత్తం రూ.260కు మించడం లేదని తెలిపారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ రైతులు పండించిన పొగాకులో కనీసం 21 శాతాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదన్నారు. రాష్ట్రంలో రైతులు రోడ్డున పడుతున్నా, ఆత్మహత్యలకు పాల్పడుతు న్నా పట్టడం లేదని, బాధిత రైతులను కనీసం పరామర్శించే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. తమ పాలనలో పొగాకు రైతుకు రూ.లక్ష వరకు సున్నా వడ్డీ రాయితీ కల్పించామని, చంద్రబాబు ఈ పథకాన్ని రద్దు చేశారని, రైతు భరోసా సాయంలోనూ కోతలు విధించారని వివరించారు. కూటమి ప్రభుత్వం దళారులతో రాజీపడటంతో దళారులు సిండికేటుగా మారి రైతులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకూ తీరని నష్టం జరిగిందని విమర్శించారు. విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసం కనిపిస్తోందన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తూంటే అక్రమంగా అరెస్టులు చేసి జైళ్లకు పంపుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, మాజీ ఎంపి మార్గాని భరత్‌రామ్, మాజీ ఎంఎల్ఎ చిర్ల జగ్గిరెడ్డి, వైసిపి కేంద్ర కమిటీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్