సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గ్రూప్‌–1 జవాబు పత్రాలపై ఆధారాలివ్వాలి

1 గంట క్రితం

ap-high-court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రిజిస్ట్రార్‌‌కు హైకోర్టు ఆదేశం

ప్రజాశక్తి-అమరావతి : గ్రూప్‌–1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని సిట్‌ నివేదికల్లో పేర్కొనడానికి ఆధారమైన డాక్యుమెంట్లను అప్పీలుదారులకు అందించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ (జుడీషియల్‌)ను ఆదేశించింది. సిట్‌ ప్రాథమిక, తుది నివేదికల మధ్య వ్యత్యాసాలున్నాయని అప్పీలుదారుల తరపున సీనియర్‌ న్యాయవాది సివి మోహన్‌‌రెడ్డి.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆధారాలను పరిశీలిస్తే సమర్థవంతమైన వాదనలు వినిపించేందుకు వీలుంటుందని తెలిపారు. దీంతో ఆధారాలు, డాక్యుమెంట్లను అప్పీలుదారులకు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసి, ఆ రోజు పూర్తిస్థాయి వాదనలు వింటామని స్పష్టం చేసింది. జస్టిస్‌ దొనడి రమేష్‌, జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్‌–1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మాన్యువల్‌ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న కారణంతో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని సింగిల్‌ జడ్జి 2024 మార్చి 13న ఆదేశించారు. దీనిపై ఎపిపిఎస్‌‌సితో పాటు ఉద్యోగాలు పొందిన, పొందని అభ్యర్థులు అప్పీళ్లు దాఖలు చేశారు. వాస్తవాలను నిర్ధారించేందుకు సిఐడి డిజి నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసిన ధర్మాసనం ఆదేశాల మేరకు దర్యాప్తు జరిగింది. సిట్‌ ప్రాథమిక, తుది నివేదికలను కోర్టుకు సమర్పించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్