శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గురుకుల పార్ట్‌టైమ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

17 నిమిషాల క్రితం

గురుకుల పార్ట్‌టైమ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
- పార్ట్‌టైమ్ ఉద్యోగుల కోర్ కమిటీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 08:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పార్ట్‌టైమ్ ఉద్యోగుల కోర్ కమిటీ

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయ సంస్థలో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, పార్ట్‌టైమ్ ఉద్యోగుల కోర్ కమిటీ రాష్ట్ర నాయకులు కోరారు. నిరసన దీక్షలో ప్రస్తావించిన సమస్యల పరిష్కారంలో పురోగతిని తెలియజేయాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అదనపు కార్యదర్శి ప్రభావతి, సంయుక్త కార్యదర్శి శ్రీదేవికి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. 82 మంది పార్ట్‌టైమ్ టీచర్లకు న్యాయం చేయాలని, వేతనాలు వెంటనే చెల్లించి, ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా వారిని విధుల్లో కొనసాగించాలని కోరారు. నష్టపోయిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, 62 ఏళ్ల వయోపరిమితిని అమలు చేయాలన్నారు. నూతన సిఒఇల ఏర్పాటు, మెగా డిఎస్‌‌సి, ఎక్సలెన్స్ సెంటర్ల ఏర్పాటు తదితర కారణాలతో ఉపాధి కోల్పోయిన పార్ట్‌టైమ్ టీచర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని కోరారు. పది రోజుల నిరసన దీక్ష కాలానికి సంబంధించిన వేతనాలు చెల్లించాలన్నారు. గురుకుల విద్యా సంస్థల్లో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్న పార్ట్‌టైమ్ ఉద్యోగులను ఉపాధి భద్రత లేకుండా ఇబ్బందులకు గురిచేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్ట్‌టైమ్ ఉద్యోగుల కోర్ కమిటీ సభ్యులు గురు రత్నం, యేసోబు, మురగారెడ్డి, ఇస్మాయిల్, వర్మ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్