శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పకడ్బందీగా స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలు: కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

20 నిమిషాల క్రితం

పకడ్బందీగా స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలు
 జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 09:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయవాడ

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత, పారదర్శక, నిష్పక్షపాత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం విజయవాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ వద్ద నిరంతర వీడియోగ్రఫీ, అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులను ఎవరైనా అడ్డుకుంటే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, షామియానాలు, ర్యాంప్‌లు వంటి కనీస వసతులు కల్పించామని, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలు, వెబ్‌కాస్టింగ్‌తో ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పారు. స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల వద్ద విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొంటూ, ఎన్నికల నియమావళిని తూచా తప్పక పాటించాలని పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్