శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సమస్యల పరిష్కారానికి సిపిఎం అభ్యర్ధులను గెలిపించాలి

19 నిమిషాల క్రితం

సమస్యల పరిష్కారానికి సిపిఎం అభ్యర్ధులను గెలిపించాలి
ప్రచార కార్యక్రమంలో ఆపార్టీ కార్పొరేటర్‌ అభ్యర్ధులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 09:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయవాడ

నగరంలోని సెంట్రల్ పరిధిలో ఉన్న పలు డివిజన్లలో సీపీఐ, కాంగ్రెస్ బలపరిచిన సీపీఎం కార్పొరేటర్ అభ్యర్థులు శుక్రవారం విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంచినీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, దోమల బెడద, పన్నుల భారాలు వంటి సమస్యలను స్థానిక ప్రజలు అభ్యర్థుల దృష్టికి తీసుకెళ్లగా.. కౌన్సిల్‌లో పోరాడి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 61వ డివిజన్‌ పరిధిలోని మున్సిపల్ కాలనీ, గిరిపురం, శిఖామణి సెంటర్ ప్రాంతాల్లో అభ్యర్థి పంబా జ్యోతి, 80వ డివిజన్ వాంబే కాలనీ సి-బ్లాక్‌లో అభ్యర్థి షేక్ రషీదాబేగం, 86వ డివిజన్‌లో అభ్యర్థి కుందేరు లక్ష్మీకుమారి నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. 85వ డివిజన్ అభ్యర్థి పతివాడ ప్రసాద్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు మాట్లాడుతూ.. కొత్త రాజీవ్‌నగర్‌లో నెలకొన్న మంచినీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటు వేసి సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్