ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఈ నెల 26న స్థానిక సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని నాలుగు నగరపాలక సంస్థలు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ కార్యాల యాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తించనుంది. ఆయా ప్రాంతాల్లోని ప్రైవేటు సంస్థలు, కంపెనీలు సైతం తమ ఉద్యోగులకు సెలవు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. మరోవైపు గ్రామ పంచాయ తీలకు సాధారణ ఎన్నికల పోలింగ్ ఈ నెల 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో మూడు విడతలుగా జరగనుంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ రోజున నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్–1881 ప్రకారం స్థానిక సెలవు ప్రకటించే అధికారాన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం కల్పించింది. సెలవు ప్రకటించడం సాధ్యం కాని పక్షంలో ఓటు వేసేందుకు తగిన సమయం కేటాయించాలని ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల యాజమాన్యాలకు స్పష్టం చేసింది.
Print Edition పట్టణ, గ్రామ పంచాయతీ పోలింగ్ రోజున సెలవు
24 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 18, 2026, 12:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)