మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరూ. 47,009 కోట్లతో హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌

1 గంట క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 01:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆమోదం తెలిపిన ప్రభుత్వం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో వివిధ రంగాల్లో రూ.88,392 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 18 ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపిబి) ఆమోదం తెలిపింది. వీటిలో అనకాపల్లి జిల్లా తూటిపాల, మాకవరపాలెంలో 720 మెగావాట్ల సామర్థ్యంతో బాలేవాడి టెక్‌పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.47,009 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ ‌కూడా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, పర్యాటకం, ఇంధనం, ఆహార శుద్ధి, పారిశ్రామిక మౌలిక సదుపాయాల రంగాల్లో ఈ పెట్టుబడులకు ఆమోదం తెలిపినట్టు సమాచారం.

ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి అత్యధికంగా రూ.49,541 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. . ఇదే సంస్థ విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఐటీ పార్సెల్-2లో 2187 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఐటి, ఐటిఇఎస్ ఆధారిత మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుకు కూడా ఆమోదం తెలిపారు. సమావేశంలో భాగంగా గతంలో ఆమోదించిన పెట్టుబడులు ఎంతవరకు కార్యాచరణలోకి వచ్చాయన్న అంశంపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించినట్టు తెలిసింది. వీలైనంత త్వరగా అవి గ్రౌండ్ అయ్యేలా చూడాలని ఆదేశించారు.

పరిశ్రమల రంగంలో రూ.35,780 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలో ఐదు సంస్థలకు 35,780.67 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఇందులో సత్యసాయి జిల్లాలో రూ.19,000 కోట్ల పెట్టుబడితో కియా ఇండియా ప్రతిపాదనలకు, శ్రీకాకుళం జిల్లాలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ 13,667 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే పరిశ్రమకి కూడా ఆమోదం తెలిపారు.

మధురవాడ ఐటీ పార్కు జీవో రద్దు

విశాఖపట్నం మధురవాడలో విశాఖ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్‌ ఐటీ పార్కు ఏర్పాటుకు సంబంధించి 2025 నవంబర్ 11న జారీ చేసిన జీవో నంబర్ 50ను రద్దు చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు సివిల్ పనులు ప్రారంభం కాకపోవడాన్ని ఇందుకు కారణంగా చూపించినట్టు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్