మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకొటియా గ్రామాల్లో కలకలం

1 గంట క్రితం

రాజకీయ సమావేశం పేరిట నలుగురు గిరిజనుల అపహరణ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 01:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రాజకీయ సమావేశం పేరిట నలుగురు గిరిజనుల అపహరణ

​ప్రజాశక్తి- సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా) : ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాలలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఉద్రిక్తత నెలకొంది. కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనల నేపథ్యంలో, తాజాగా నలుగురు గిరిజనులు అదృశ్యమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రాజకీయ సమావేశం ఉందని నమ్మించి, గుర్తుతెలియని వ్యక్తులు వాహనాల్లో తీసుకుపోయారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది.

​అసలేం జరిగింది?

కొటియా గ్రూప్ పరిధిలోని గంజాయిభద్ర, ధూళిభద్ర, దిగువ కొటియా, పగులుచెన్నూరు గ్రామాల నుంచి అందిన సమాచారం ప్రకారం... మంగళవారం కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వాహనాల్లో ఆయా గ్రామాలకు వచ్చారు. ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన రాజకీయ సమావేశం ఉందని చెప్పి, నలుగురు స్థానికులను తమ వాహనాల్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ​అపహరణకు గురైన వారిలో గెమ్మల బీసు అలియాస్ పొట్టి బీసు (గంజాయిభద్ర), గెమ్మల డుంబు (దిగువ కొటియా), చౌడుపల్లి రాజు (ధూళిభద్ర), కోనేటి పేతురు (పగులుచెన్నూరు) ఉన్నారు.

​పోలీసులకు ఫిర్యాదు

తమ వారు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో, ఎవరో ఉద్దేశపూర్వకంగానే వారిని కిడ్నాప్ చేశారని భావించిన కుటుంబసభ్యులు, బంధువులు సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని రూరల్ ఎస్‌ఐ ఐ.రవీంద్రరాజు తెలిపారు. అపహరణకు గురైన వారిని తక్షణమే సురక్షితంగా వెతికి తీసుకురావాలని కుటుంబసభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్