మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లేళ్ల అప్పిరెడ్డి అరెస్టు పట్ల జగన్‌ ఆగ్రహం

07 నవంబర్, 2026

Local body elections are approaching... we must stand firm: YS Jagan.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 07:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అరెస్టు పట్ల వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తూ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేస్తే తప్పుడు కేసులు బనాయించి అరెస్టులకు పాల్పడటం దుర్మార్గమని శనివారం ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ఎమర్జెన్సీని తలపించేలా ప్రస్తుత పాలన సాగుతోందని విమర్శించారు. గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెంలో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన అనంతరం బ్యాలెట్‌ బాక్సులను నేరుగా నాగార్జున విశ్వవిద్యాలయానికి తరలించకుండా నల్లపాడు వద్ద ఎందుకు దింపారని ప్రశ్నించారు. ఎవరి ఆదేశాలతో బాక్సులను అక్కడికి తీసుకొచ్చారు? వాటికి కల్పించాల్సిన భద్రత ఏమైందని నిలదీశారు. స్ట్రాంగ్‌ రూమ్‌కు చేరాల్సిన బ్యాలెట్‌ బాక్సులు నడిరోడ్డుపై కనిపిస్తే, వాటిని గుర్తించి శాంతియుతంగా నిరసన తెలిపిన వైసిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలపై లాఠీచార్జి చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఒక ఎమ్మెల్సీపై డెకాయిట్‌, దొంగతనం కేసులు నమోదు చేయడం దారుణమన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్