గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాక్రోచ్ ల అరెస్టులపై జగన్ ట్వీట్ - స్పందించిన అభిజిత్ దీప్కే..!

2 గంటల క్రితం

Jagan's tweet on the arrests of 'cockroaches' – Abhijit Deepke responds!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 04:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అమరావతి : సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ నేతలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆందోళనల కేంద్రమైన జంతర్ మంతర్ ను మూసేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా అక్కడికి వెళ్లి జాతీయ పతాకం ఎగురవేసిన సిజెపి నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను పోలీసులు అరెస్టు చేసి తీహార్ జైలుకు రిమాండ్ కు పంపడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో .... వైసిపి అధినేత వైఎస్ జగన్ తాజాగా ట్వీట్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ల అరెస్టులను ఆయన ఖండించారు. సమస్య వచ్చిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే చొరవ చూపి వ్యవహరించడం ఎప్పుడూ మెరుగైన ఫలితాలను ఇస్తుందని .. కేంద్రానికి తెలిపారు. ఈ వ్యవస్థలో సరిదిద్దాల్సిన లోపం ఒకటి ఉందని జగన్ గుర్తు చేశారు. ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని పునరుద్ధరించాలని జగన్ కోరారు. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల అరెస్టుల వల్ల ఎలాంటి పరిష్కారం లభించదన్నారు. అవి పరిస్థితిని మరింత తీవ్రతరం మాత్రమే చేస్తాయన్నారు. అలాగే తాను సౌరవ్ దాస్, అశుతోష్ రాంంకాల పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నాని జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.


ఈ ట్వీట్ పై కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దీప్కే స్పందించారు. తమ పార్టీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ల అక్రమ అరెస్టులపై స్పందించినందుకు ధన్యవాదాలు అంటూ జగన్ కు దీప్కే ట్వీట్ చేశారు. ఇప్పటికే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులంతా కాక్రోచ్ ల అరెస్టులను తప్పుబడుతూ ట్వీట్లు చేశారు. వారందరికీ దిప్కే ఇలాగే విడివిడిగా బదులిచ్చారు. తమకు మద్దతుగా నిలిచినందుకు ధన్యావాదాలు తెలిపారు. ఇప్పటికే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ లు నీట్ అక్రమాలపై జరిపిన నిరసనలకు సైతం గతంలో వైఎస్ జగన్ మద్దతు ప్రకటించారు. వారి పోరాటం కారణంగా కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్ ను తప్పించడాన్ని కూడా స్వాగతించారు. ఇప్పుడు సిజెపి నేతల అరెస్టులను ఖండించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్