ప్రజాశక్తి-ఉప్పలగుప్తం
సినీ హీరో సాయిధర్మతేజ్ పుట్టినరోజు సందర్భంగా గురువారం మెగా యూత్ ఫోర్స్ మండల అధ్యక్షుడు మహాదశ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ లు ఉచితంగా అందజేశారు. ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్ ఎదురుగా సిరిపల్లి- మునిపల్లి ప్రధాన ఆర్ అండ్ బి రోడ్డుపై వెళుతున్న ద్విచక్ర వాహన దారులను ఆపి వాహనదారులకు మెగా ఫోర్స్ అధ్యక్షుడు అధ్యక్షుడు శ్రీకాంత్ హెల్మెట్లు అందించారు. వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి హెల్మెట్ లు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ఆకుల సూర్యనారాయణమూర్తి, చిక్కం సూర్యమోహన్, మెగాఫోర్స్ యూత్ సభ్యులు కోలా రమేష్, కట్టా దుర్గాప్రసాద్, పలచోళ్ళ చైతన్య, నాగులపల్లి సతీష్, చీకట్ల సాయిరాం, శిరగం శ్రీను, చిక్కం సాయి పవన్ కళ్యాణ్, కొండేటి నాని తదితరులు పాల్గొన్నారు.
హెల్మెట్లు అందజేస్తున్న శ్రీకాంత్







కామెంట్లు (0)