గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా దండి ప్రియాంక దరఖాస్తు

1 గంట క్రితం

కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా దండి ప్రియాంక దరఖాస్తు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 06:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విశాఖ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌‌ఛార్జి ప్రియాంక దండి కాంగ్రెస్ పార్టీ జివిఎంసి మేయర్ అభ్యర్థిగా అవకాశం కలిపించమని పార్టీ నాయకత్వానికి దరఖాస్తు సమర్పించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖకు చేసిన అభివృద్ధిని వివరించి, మోడీతో జత కట్టిన పార్టీలకు బుద్ది చెప్పి, ప్రజలు కాంగ్రెస్‌‌కు పట్టం కట్టేలా కృషి చేస్తానని, జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి మేనిఫెస్టో ద్వారా ప్రజల ముందు ఉంచుతానని ప్రియాంక తెలిపారు. ఆమెతో పాటు తూర్పు నియోజకవర్గం నుండి ఈగల మోహన్ సాయి, పర్వీన్ ఖాన్, చింతపల్లి వెంకటేష్, గుర్రం కనకరావు, ఓలిశెట్టి స్వప్న, ఎం.అరుణకుమారి, ఇసంపల్లి రఘురాజా కార్పొరేటర్ అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్