గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అంతర్జాతీయ టార్గెట్‌ బాల్‌ పోటీల్లో రూపేష్ ప్రతిభ

1 గంట క్రితం

అంతర్జాతీయ టార్గెట్‌ బాల్‌ పోటీల్లో రూపేష్ ప్రతిభ
భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విఎంఐపిఎస్‌ విద్యార్థి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 06:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

* భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విఎంఐపిఎస్‌ విద్యార్థి


ప్రజాశక్తి–ఆనందపురం

నేపాల్‌ రాజధాని ఖాట్మండులో నిర్వహించిన అంతర్జాతీయ టార్గెట్‌ బాల్‌ ప్రెసిడెంట్‌ కప్‌ పోటీల్లో భారత జట్టు విజయం సాధించింది. ఈ జట్టుకు ఆనందపురం మండలం, శొంఠ్యాం పంచాయితీ, మిందివాని పాలెం విశ్వనాథ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ ఫైనలియర్‌ విద్యార్థి పైలా రూపేష్‌ ప్రాతినిధ్యం వహించారు. భారతీయ టార్గెట్‌ బాల్‌ ఫెడరేషన్‌ జట్టు తరఫున అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 12 మంది క్రీడాకారులు ఎంపిక కాగా, వారిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆరుగురు ఎంపికయ్యారు. బంగ్లాదేశ్‌ జట్టుతో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించి విజేతగా నిలిచింది. ఈ విజయంతో పైలా రూపేష్‌ను కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు సహచర విద్యార్థులు అభినందనలు తెలిపారు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్