గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జెసిని జిల్లా వక్ప్ అధికారిగా నియమించాలి

1 రోజు క్రితం

wawf
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 11:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎపి వక్ప్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వక్ప్ ఆస్తుల పరిరక్షణ, ఆక్రమణల నివారణ, న్యాయపరమైన చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో వక్ఫ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ను నియమించాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల వక్ఫ్ భూముల ఆక్రమణలు, న్యాయ వివాదాలు, అక్రమ నిర్మాణాల సమస్యలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. జెసి ఆధ్వర్యనా రెవెన్యూ,రిజిస్ట్రేషన్, మున్సిపల్ తదితర శాఖల మధ్య సమన్వయంతో వక్ఫ్ ఆస్తుల రక్షణ, ఆక్రమణల తొలగింపు, న్యాయపరమైన చర్యలు మరింత వేగవంతంగా అమలవుతాయని తెలిపారు. ఈ మేరకు వక్ఫ్ బోర్డు తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వక్ఫ్ ఆస్తులను భావితరాలకు భద్రపరచడం రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్