శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం ఊడిగం

1 గంట క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 01:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- కాలుష్య సమస్య పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం : కె లోకనాథం

ప్రజాశక్తి- గాజువాక (విశాఖపట్నం) కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం ఊడిగం చేస్తోందని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లోకనాథం విమర్శించారు. కాలుష్య కోరల నుంచి గాజువాక ప్రజల ప్రాణాల రక్షణ కోసం స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో ఉద్యమించాలంటూ కాలుష్య వ్యతిరేక పోరాట వేదిక ఆధ్వర్యంలో పాత గాజువాక జంక్షన్‌‌లో శనివారం నిరసనచేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్నా రాజ్యాంగ మౌలిక సూత్రాలు అమలు కావడం లేదన్నారు. కులాలు, మతాలకు అతీతంగా లౌకిక పునాదిపై భారతదేశం ఏర్పడిందన్నారు. కానీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు లేవని, కార్మికులకు రక్షణ లేదని, వ్యవసాయానికి గిట్టుబాటు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో కాలుష్యంతో కూడిన పరిశ్రమలు ఏర్పాటు చేయరాదని, అదాని గంగవరం పోర్టు వల్ల గాజువాక కాలుష్యంతో కునారిల్లుతోందన్నారు. కాలుష్య సమస్యను పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ముందుగా పాత గాజువాక జంక్షన్‌‌లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ఎగురవేశారు. ‘ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటే కాలుష్యాన్ని నియంత్రించాలి, కాలుష్య కోరల నుంచి గాజువాకను రక్షించాలి’ అన్న ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర నగర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఎం.రాంబాబు, డి.రమణ, జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ ఎం.రమేష్ కుమార్, పెన్షనర్ల సంఘం నాయకులు ఎన్‌.రామారావు, ఐద్వా నాయకులు ఎం.శ్రీదేవి, జి.లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు టి.శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్