- వైసిపి స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులకు నామినేషన్ నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు అన్ని దశల్లో న్యాయపరమైన అండ అందించేందుకు పార్టీ లీగల్ సెల్ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని వైసిపి స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులతో శనివారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గత రెండున్నరేళ్లుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులకు లీగల్ సెల్ అండగా నిలిచిందని అభినందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకునేలా సహకరించాలని సూచించారు. నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, పోలింగ్ సందర్భంగా ఎదురయ్యే సమస్యలపై వెంటనే స్పందించే వ్యవస్థ ఉండాలన్నారు. ప్రతి జిల్లాను యూనిట్‌గా తీసుకుని లీగల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా సెంట్రల్ ఆఫీస్‌లో లీగల్ వార్‌రూమ్ తరహా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.








కామెంట్‌లు (0)