- భారత వాతావరణ కేంద్రం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ నుంచి ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ మీదుగా ఈశాన్య ఉత్తరప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలోనూ ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని సూచించింది.








కామెంట్‌లు (0)