ఎపిసిపిడిసిఎల్ సిఎండి పుల్లారెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్నబ్ తుపాన్ వల్ల ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ర్టిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎపిసిపిడిసిఎల్) పరిధిలో ప్రాథమిక అంచనాల ప్రకారం విద్యుత్ వ్యవస్థకు సుమారు రూ.4.52కోట్ల మేర నష్టం జరిగినట్లు ఆ సంస్థ సిఎండి పి పుల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో . తుపాను ప్రభావంతో 1663 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని తెలిపారు. 33 కెవి 125 స్తంభాలు, 11 కెవి 749 స్తంభాలు, ఎల్‌టి పరిధిలోని 789 స్తంభాలు దెబ్బతినట్లు వివరించారు. 11కెవి విద్యుత్ లైన్లు 57.05 కిలోమీటర్లు, ఎల్‌టి విద్యుత్ లైన్లు 82.07కిలోమీటర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 280 దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)