తాడేపల్లి: దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇది శనివారానికి సుస్పష్టమైన అల్పపీడనంగా, ఆదివారానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. నివారం నుండి మంగళవారం వరకు సముద్రం అలజడిగా ఉంటుంది. మత్స్యకారులు ఆగ్నేయ, నైరుతి, మధ్య బంగాళాఖాతం వైపు వేటకు వెళ్లరాదని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌పై దీని ప్రభావం లేదని రానున్న రోజుల్లో ఇది ఏటు వైపు పయనిస్తుందనే అంశంపై స్పష్టత రానుందని ఆయన తెలిపారు.
Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026, 01:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)