సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యూట్యూబర్ నందన దంపతులపై సిఎం ప్రజావాణిలో ఫిర్యాదు

1 గంట క్రితం

Complaint lodged against YouTuber Nandana and her husband at the CM's 'Prajavani'
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

సోమాజిగూడ : యుకె లో స్థిరపడిన యూట్యూబర్‌ నందన, ఆమె భర్త మధుకర్‌.. అక్కడ ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ కొందరు నిరుద్యోగులను మోసగిస్తున్నారని ఆరోపిస్తూ .... పలువురు బాధితులు సిఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బాధితులు బేగంపేటలోని జ్యోతిబాఫులే ప్రజాభవన్‌లో నిర్వహించే సిఎం ప్రజావాణిలో ఇన్‌ఛార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలు గద్వాల విజయలక్ష్మి, ప్రజావాణి స్టేట్‌ నోడల్‌ అధికారి విద్యాసాగర్, ఎన్‌ఆర్‌ఐ సలహా కమిటీ ఛైర్మన్, అంబాసిడర్‌ డాక్టర్ వినోద్‌కుమార్‌లను కలిసి తమ గోడు వినిపించారు. యుకె ప్రభుత్వం తమ కన్సల్టెన్సీ కంపెనీకి ఉద్యోగులను నియమించుకునే అనుమతి ఇచ్చిందని నందన, ఆమె భర్త మధుకర్‌ నమ్మబలికారని తెలిపారు. స్టూడెంట్, విజిటర్‌ వీసాలపై యుకె కు వెళ్లి, వీసా గడువు ముగియనున్నవారికి ఉద్యోగ వీసా ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.25 లక్షల నుండి రూ.95 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు. వారి కన్సల్టెన్సీ సంస్థ సమర్పించిన పత్రాలు నకిలీవని తెలియడంతో యుకె ప్రభుత్వం పలువురు బాధితులపై తీవ్ర చర్యలు తీసుకుందని వివరించారు. తెలంగాణలోని వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్ర డిజిపి తో పాటు ఇడి కి ఫిర్యాదు చేయాలని, తాము పూర్తి సహకారం అందిస్తామని బాధితులకు ప్రజావాణి సభ్యులు హామీ ఇచ్చారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్