ప్రజాశక్తి -ఎ.కొండూరు : కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన ఎన్‌టిఆర్ జిల్లా ఎ కొండూరు మండలంలో చీమలపాడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. చీమలపాడు గ్రామంలోని పెద్ద తండాకు చెందిన జరపలా లక్ష్మణ్ (60) గత 15 సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన చికిత్స నిమిత్తం సుమారు రూ. పది లక్షల వరకూ ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆదివారం ఆయన మృతి చెందారు. లక్ష్మణ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్ష్మణ్ మృతదేహాన్ని సిపిఎం మండల కార్యదర్శి పి ఆనందరావు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎ కొండూరు మండలంలో కిడ్నీ రోగులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదన్నారు. ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గతంలో వేసిన పంచాయతీ పైప్‌లైన్‌కే కృష్ణా జలాల కనెక్షన్ ఇచ్చి కలుషితమైన నీటిని సరఫరా చేస్తున్నారని, దీనివల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని, ఎన్నిసార్లు ప్రభుత్వానికి తెలియజేసినా స్పందన లేదని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఎ కొండూరు మండలంలో ప్రత్యేక కిడ్నీ ఆస్పత్రి నిర్మించాలని, పంచాయతీ పైప్‌లైన్‌కు బదులుగా ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా కృష్ణా జలాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మండలంలోనే అధిక సంఖ్యలో డయాలసిస్ సేవలు అందు బాటులోకి తీసుకురావాలని కోరారు.
కిడ్నీ వ్యాధితో వ్యక్తి మృతి
21 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 22, 2026, 12:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)