శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మంగాదేవి మృతి విద్యా రంగానికి తీరని లోటు : ఐద్వా

24 నిమిషాల క్రితం

aidwa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 07:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవకురాలు నన్నపనేని మంగాదేవి మృతికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆంధ్రప్రదేశ్ కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆమె మరణం విద్యారంగానికి, మహిళా అభ్యుదయానికి తీరని లోటని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె. శ్రీదేవి, వి. సావిత్రి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక్క విద్యార్థితో ప్రారంభించిన విద్యా ప్రస్థానాన్ని వేలాది మంది బాలబాలికలకు నాణ్యమైన విద్యను అందించే మహా విద్యావృక్షంగా తీర్చిదిద్దారని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్, ‘చేతన’ సంస్థను స్థాపించి పిల్లలకు విద్యతోపాటు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ఐద్వా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంగాదేవికి ఘన నివాళులర్పించారు.

ఉపాధ్యాయులకు స్ఫూర్తి

మహోన్నత మానవతావాదిగా ఎందరో ఉపాద్యాయులకు, విద్యార్థులకు స్పూర్తి నిచ్చారని మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.రమాదేవి పేర్కొన్నారు. తనచుట్టూ సేవా దృక్పథం కలిగిన స్నేహితుల బ్రృందాన్ని సమీకరించి అనేక కార్యక్రమాలను విభిన్నంగా చేయడం ఆదర్శప్రాయం, అనుసరణీయని తెలిపారు. పిల్లలకు విద్య నేర్పడం ఆటపాటలతో ఉండాలని నమ్మడం మాత్రమే కాదు.. ఆమె ఆటపాటలను , అభినయాన్ని భాగంగా చేసి తాను భాగమై విద్యాభివృద్ధికి ఉపయోగించడం ఆమె ప్రవ్రృత్తిగా మార్చుకున్న మార్గదర్శిని కొనియాడారు. మంగాదేవికి నివాళులర్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్