శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రైలు ప్రయాణంలో...

57 నిమిషాల క్రితం

రైలు ప్రయాణంలో... image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 06:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ట్రైన్'. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. రైలు ప్రయాణంలో వరుస హత్యలు చోటుచేసుకోవడం, భయానక పరిస్థితుల నుంచి ప్రయాణికులు బయటపడేందుకు చేసే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఆకట్టుకుంది. వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిస్కిన్ కథ, దర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్