రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న పాన్ ఇండియా చిత్రం #RC17లో నటీనటుల ఎంపికకు చిత్రబృందం క్యాస్టింగ్ కాల్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. సినిమాలోని విభిన్న పాత్రల కోసం 16 నుంచి 60 ఏళ్ల వయసున్న నటీనటులను ఎంపిక చేయనున్నట్లు నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ వెల్లడించాయి. నటనపై ఆసక్తి, ప్రతిభ ఉన్నవారు ఆడిషన్‌లో పాల్గొనవచ్చని తెలిపాయి. ఆసక్తిగల అభ్యర్థులు తమ నటనా ప్రతిభను చూపించే వీడియోలు, వ్యక్తిగత ప్రొఫైల్ వివరాలను src17casting@gmail.comకు లేదా 9110564651 వాట్సాప్ నంబర్‌కు పంపించాలని సూచించాయి.
'ఆర్‌సీ17'లో నటించే అవకాశం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 27, 2026, 06:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)