శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీస్‌ అధికారిగా ప్రభాస్

1 గంట క్రితం

పోలీస్‌ అధికారిగా ప్రభాస్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 06:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో తెరకెక్కుతున్న చిత్రం 'స్పిరిట్'. ఇందులో ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో ఈ పాత్రను అంగీకరించడానికి గల కారణాన్ని ప్రభాస్ వెల్లడించారు. తన వద్దకు గతంలో ఎన్నో పోలీస్ కథలు వచ్చినా, అవి తనకు సరిపోవనిపించి అంగీకరించలేదని చెప్పారు. సందీప్ రెడ్డి వంగా చెప్పిన కథ నచ్చడంతో పోలీస్ యూనిఫాం ధరించేందుకు సిద్ధమయ్యానన్నారు. ఈ పాత్రలో ప్రత్యేకమైన శైలి ఉండాలని, అందుకు ప్రతిభావంతుడైన దర్శకుడు అవసరమని అభిప్రాయపడ్డారు. థియేటర్లలో పోలీస్ యూనిఫాంలో తన ప్రవేశాన్ని చూసి అభిమానులు ఎలా స్పందిస్తారో, తెరపై తన పాత్ర శైలి ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రభాస్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్