శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నటుడు గిరిబాబు మృతిపై పలువురు సంతాపం

3 గంటల క్రితం

giribabu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 09:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నటుడు గిరిబాబు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ని పలువురు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

గిరిబాబు కన్నుమూత విచారకరం..

ప్రముఖ సీనియర్ నటుడు, దర్శక నిర్మాత గిరిబాబు కన్నుమూత విచారకరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గిరిబాబు ఐదు దశాబ్దాల పాటు 600లకు పైగా చిత్రాల్లో నటించి.. విలన్‌గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను మెప్పించారని కొనియాడారు.

విభిన్న పాత్రలు పోషించారు..

గిరిబాబు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నానని డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారని చక్కటి హాస్యం పండించారని కొనియాడారు. నిర్మాతగా, దర్శకుడిగా విజయవంతమైన చిత్రాలు రూపొందించారని పేర్కొన్నారు.గిరిబాబు రఘుబాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సిని పరిశ్రమకు తీరని లోటు..

నటుడు గిరిబాబు ఇకలేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసిందని అగ్ర హిరో చిరంజీవి పేర్కొన్నారు. విలక్షణమైన నటనతో, తనదైన ప్రత్యేక శైలితో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల ద్వారా నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా తెలుగు చిత్ర పరిశ్రమకు గిరిబాబు అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు.

తెలుగు ప్రేక్షకులను అలరించారు..

నాలుగు దశాబ్దాల పాటు 600కు పైగా సినిమాల్లో తనదైన నటనతో గిరిబాబు గారు తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించారని విద్యాశాఖామంత్రి నారాలోకేష్ తెలిపారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రతిభను చాటుకున్నారని కొనియాడారు.

విలక్షణమైన నటుడిని కోల్పోయాం..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన సహజ, విలక్షణ నటనతో దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటులు గిరిబాబు మృతి చెందడం పట్ల రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విలక్షణమైన నటుడిని కోల్పోయాని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్