- సోవియట్‌ను కూల్చినా మార్క్స్ ప్రభావం కొనసాగుతుంది
- అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో వ్యాఖ్యలు
వాషింగ్టన్: ప్రపంచ పెట్టుబడికి కేంద్ర స్థానం అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో పలువురు సోషలిస్టులు గెలిచిన సంగంతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో మార్క్సిజాన్ని ఓడించలేకపోయామని అంగీకరించారు. అంతేకాదు. సోవియట్‌లో కమ్యూనిజాన్ని కుప్పకూల్చినా, మార్క్సిజం అంతరించలేదని, అది కొత్త మార్గాల్లో, అంతర్జాతీయ సంస్థల రూపంలో కొనసాగుతోందని రూబియో శుక్రవారం పేర్కొన్నారు. వాషింగ్టన్ డిసిలో జరిగిన ఫెడరలిస్ట్ సొసైటీ జాతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సోవియట్ కమ్యూనిజం అనే వ్యవస్థను ఓడించాం. కానీ మార్క్స్ స్ఫూర్తిపై గెలవలేకపోయాం’’ అని ఆయన అన్నారు. దేశాల ప్రయోజనాలు, అంతర్జాతీయ ఐక్యత, ఏకాభిప్రాయం వంటి సిద్ధాంతాల్లో ఆ భావజాలం విస్తరిస్తోందని రూబియో తెలిపారు. అలాగే, అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసిసి)ను ‘‘ఎన్నికకాని ప్రపంచ ట్రిబ్యునల్’’గా అభివర్ణించారు. అమెరికా దాన్ని ఎన్నడూ అంగీకరించని, ఆమోదించని నిబంధనల ద్వారా అమెరికాపై పెత్తనం చెలాయించేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘‘కత్తులు చేపట్టిన వాళ్లకు చట్టాలు, న్యాయం ఉదహరించడం ఆపండి’’ అంటూ తీవ్రంగా ఐసిసిని హెచ్చరించారు. ట్రంప్ ప్రభుత్వం ఐసిసి న్యాయస్థానంపై విధించిన ఆంక్షలనూ సమర్థించారు. అయితే, ఇటీవల జరిగిన పారిస్‌లో జరిగిన జి-7 విదేశాంగ మంత్రుల సమావేశంలో రూబియో పాల్గొన్నారు. అమెరికా ప్రపంచ వ్యవస్థ (వరల్డ్ ఆర్డర్) కోసం పనిచేయదని, తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికే పనిచేస్తుందంటూ చెప్పుకొచ్చారు.







కామెంట్లు (0)