గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగల్లంతైన మత్స్యకారులు క్షేమం..

1 గంట క్రితం

Rameswaram fishermen
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 08:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- యు.కొత్తపల్లి (కాకినాడ జిల్లా): ​సముద్రంలో ఈ నెల 11న బోటుపై చేపల వేటకు వెళ్లి గల్లంతైన కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. బోటు యజమాని గరికిన సింహాద్రి నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని పూడిమడక తీరానికి సమీపంలో తాము సురక్షితంగా ఉన్నామని, చేపల వేట ముంగించుకొని వస్తున్నామని, త్వరలో ఇంటికి చేరుకుంటామని తెలిపారు. ఈ వార్తతో మత్స్యకారుల కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. బోటు ప్రస్తుతం బంగారంపాలెం వద్ద ఉందని, గురువారం అర్ధరాత్రి 12 నుంచి ఒంటి గంట మధ్య కాకినాడ తీరానికి చేరుకుంటుందని అంచనా వేశామని మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యకారులు చేపల వేట కోసం డీప్‌ ‌సీ ప్రాంతానికి వెళ్లడంతో మొబైల్‌ ‌సిగ్నల్‌ అందుబాటులో లేదని పేర్కొన్నారు. బోటు సురక్షితంగా తీరానికి చేరే వరకూ పరిస్థితిని సమీక్షించాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఇందుకు అనుగుణంగా అన్ని చర్యలూ తీసుకున్నామని ఫిషరీష్‌ ‌డెవలప్‌‌మెంట్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌డిఒ) రామకృష్ణ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్