గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎఐటియుసి జాతీయ కార్యదర్శిగా 'రావులపల్లి'

1 గంట క్రితం

ఎఐటియుసి జాతీయ కార్యదర్శిగా 'రావులపల్లి' image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 07:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి-మార్కాపురం : దేశంలోనే శతాబ్దానికి పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియుసి) జాతీయ కార్యదర్శిగా మార్కాపురం పట్టణానికి చెందిన రావులపల్లి రవీంద్రనాథ్ ఎన్నికయ్యారు. ఈ నెల 22 నుండి 26 వరకు బెంగుళూరులో జరిగిన ఎఐటియుసి 43వ జాతీయ మహాసభ చివరి రోజైన గురువారం నూతన జాతీయ కమిటీని ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటివరకు జాతీయ కార్యవర్గ సభ్యులుగా రావులపల్లి పనిచేశారు. గత ఆరు సంవత్సరాలుగా ఎఐటియుసి ఎపి రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రకాశం జిల్లా ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షులుగా సుదీర్ఘ కాలం పనిచేశారు. విద్యార్థి దశలో ఎఐఎస్ఎఫ్ ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కార్మిక, కర్షక, అట్టడుగు వర్గాల గొంతుకగా గత నాలుగు దశాబ్దాలుగా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్