'అవతార్' ఫ్రాంచైజీ తదుపరి చిత్రాల విడుదల తేదీలను డిస్నీ ప్రకటించింది. విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణ వ్యయం కారణంగా మరో సినిమా తీయడం కష్టమని గతంలో దర్శకుడు జేమ్స్ కామెరాన్ ప్రకటించడంతో నాలుగో భాగంపై సందేహాలు నెలకొన్నాయి. తాజాగా డిస్నీ ప్రకటించిన సినిమాల జాబితాలో 'అవతార్ 4'కు చోటు దక్కింది. ఈ చిత్రం 2029 డిసెంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఐదో భాగం 'అవతార్ 5' 2031 డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. సల్లీ కుటుంబంలోని చిన్న వయసు సభ్యులకు సంబంధించిన సన్నివేశాలను గత చిత్రాలతో పాటే కొన్నేళ్ల క్రితం చిత్రీకరించారు.
'అవతార్ 4' విడుదల తేదీ ఖరారు
1 గంట క్రితం
వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026, 07:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)