నక్కపల్లి (అనకాపల్లి) : నక్కపల్లిలో నేడు జరగనున్న మిట్టల్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణకు వెళుతున్న సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణలను ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు లో పోలీసులు అరెస్టు చేసి ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈరోజు (గురువారం) తెల్లవారుజాము నుంచి సిపిఎం రాయవరం మండల కార్యదర్శి ఎం.సత్యనారాయణ, నక్కపల్లి మండల కార్యదర్శి ఎం.రాజేష్, రాజయ్యపేట సిపిఎం శాఖ కార్యదర్శి మైలపల్లి మహేష్ బాబులను పోలీసులు గృహ నిర్బంధం చేయడాన్ని సిపిఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. రైతు సంఘం జిల్లా కార్యదర్శి, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజును గత 3 రోజులుగా గృహనిర్బంధంలో ఉంచడం అప్రజాస్వామిక చర్య అని నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్రమంగా అరెస్టు చేసినవారిని, గృహనిర్బంధంలో ఉన్న వారిని భేషరతుగా విడుదల చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నదన్నారు.
మిట్టల్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణ - సిపిఎం నేతలు గృహనిర్బంధం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 15, 2026, 11:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)