గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మాచర్లలో స్ట్రాంగ్ రూములు, రిసెప్షన్ కేంద్రాల తనిఖీ

1 గంట క్రితం

sasd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 12:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : జడ్పీటీసీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మాచర్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు, రిసెప్షన్ కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్, జడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంజన శ్రీహర్ష తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూములు, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక పరికరాలు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద 24గంటల పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్