గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీసుల అదుపులో కోనేటి సులోచన

1 గంట క్రితం

koneti
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 12:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 14 కేసుల్లో నిందితురాలు

- భూకబ్జా, మోసం ఆరోపణలు

ప్రజాశక్తి-మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లికి చెందిన కోనేటి సులోచనను పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. భూకబ్జాలు, మోసాలకు సంబంధించిన ఆరోపణలతో పాటు పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఆమెపై పోలీసులు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. సులోచనపై మదనపల్లె వన్‌టౌన్‌, టూటౌన్‌, తాలూకా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 14 చీటింగ్‌ కేసులతో పాటు భూకబ్జా, హత్యాయత్నం తదితర కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆమెపై రౌడీషీట్‌ కూడా ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి, అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, డీఎస్పీ బి.ప్రసాద్‌ ఆదేశాల మేరకు వన్‌టౌన్‌ పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ కేసులకు సంబంధించి పోలీసుల నుంచి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్