గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మదనపల్లెలో మహిళ దారుణ హత్య

1 గంట క్రితం

crimes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 12:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలోని ఓ లాడ్జిలో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన గురువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు మృతురాలు కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లా ములబాగల్‌కు చెందిన మహిళగా గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న నవీన్‌ భాష అలియాస్‌ నవీన్‌ పాషా ములబాగల్‌లోని కురుప్పేటకు చెందిన అక్రమ్‌ భాష కుమారుడని పేర్కొన్నారు. పట్టణంలోని ఓ లాడ్జిలో బుధవారం అర్ధరాత్రి మహిళను బీరు సీసాతో పొడిచి హత్య చేసిన ఘటన గురువారం ఉదయం వెలుగులోకి రావడంతో, సమాచారం అందరంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశామన్నారు. దర్యాప్తులో భాగంగా మృతురాలి వివరాలను గుర్తించడంతో పాటు, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. మహిళ హత్యకు గల కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతోందని, దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్