ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన లాల్దుహోమా.. ఉండవల్లిలోని చంద్రబాబును ఆయన నివాసంలో సోమవారం కలిశారు. ఈ సందర్భంగా లాల్దుహోమాకు ఆయన జ్ఞాపికను అందజేశారు. ముందుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. లాల్దుహోమాకు స్వాగతం పలిశారు. అనంతరం శాలువాతో సత్కరించి యువగళం పాదయాత్ర పుస్తకాన్ని అందజేశారు.








కామెంట్‌లు (0)